డీఈఓగా చంద్రకళ బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

డీఈఓగా చంద్రకళ బాధ్యతల స్వీకరణ

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖాధికారిగా లెంక చంద్రకళ శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణాజిల్లా ఉప విద్యాశాఖాధికారిణిగా ఉన్న చంద్రకళ పదోన్నతిపై విశాఖ డీఈవోగా వచ్చారు. ఇంతవరకు డీఈఓగా ఉన్న లింగేశ్వరరెడ్డి విజయవాడ ఆదర్శ పాఠశాలల సంయుక్త సంచాలకులుగా బదిలీపై వెళ్లారు. చంద్రకళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆమె ఆంధ్రప్రదేశ్‌కు స్పౌజ్‌ కోటాలో వచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని