చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 19/10/2021 04:41 IST

చిత్ర వార్తలు

అందరూ చూసేలా... అంతం చేసేలా!

 

కరోనా కట్టడికి టీకా ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పలు రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా సెంట్రల్‌ పార్కు వద్ద పెద్ద పరి మాణంలో టీకా, ఇంజక్షన్‌ బొమ్మను ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

-ఈనాడు, విశాఖపట్నం


విధి నిర్వహణకు సాహసం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ డుమ్ములమామిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదు. కొండలు, వాగులు, అడవి దాటుకుంటూ గ్రామానికి వెళ్లాలి. దీంతో అధికారులు అటువైపుగా కన్నెతి చూడరు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో జల జీవన్‌ మిషన్‌ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాన్ని పరిశీలించడానికి సోమవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ జీవీఎస్‌ ప్రకాష్‌, ఏఈ విజయ్‌కుమార్‌ సోమవారం ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను స్థానికుల సాయంతో దాటి గ్రామానికి చేరుకున్నారు. పథకం పనులను పరిశీలించారు.

 


ఇవిగో గోతులు.. అవిగో బాతులు

భారీ పరిశ్రమలు కొలువై, వేలాదిమంది కార్మికులు రాకపోకలు సాగించే అనకాపల్లి-అచ్యుతాపురం రహదారిపై కొండకర్ల రైస్‌మిల్‌ వద్ద రోడ్డు అంచు భారీగా కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. దానిలో వర్షపు నీరు చేరి చెరువులా తయారైంది. దీంతో అటుగా వస్తున్న బాతులు ఈ గుంతను చెరువులా భావించి ఈత కొడుతున్న సన్నివేశాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

- అచ్యుతాపురం, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని