గీతం డీమ్డ్‌ వర్సిటీ తరగతులు ప్రారంభం
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

గీతం డీమ్డ్‌ వర్సిటీ తరగతులు ప్రారంభం


మాట్లాడుతున్న గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ ఎం.శరత్‌చంద్రబాబు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ గీతం డీమ్డ్‌ వర్సిటీలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఆంగ్లభాషా పరిజ్ఞానంపై సైతం పరీక్ష నిర్వహించినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఎం.శరత్‌చంద్రబాబు పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన నాలుగున్నరేళ్ల ఫిజియోథెరపీ కోర్సు తరగతులు కూడా సోమవారం ప్రారంభమయ్యాయని సంబంధిత విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ మాధురీ కాశి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని