పదునైన వ్యూహంతో కట్ట‘ఢీ’
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

పదునైన వ్యూహంతో కట్ట‘ఢీ’

మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్‌సవాంగ్‌

రాజమహేంద్రవరం: ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా, సరఫరా కట్టడికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పేర్కొన్నారు. ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌) వ్యూహంపై పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. గంజాయి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు ప్రణాళికపై ఐపీఎస్‌ల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడి పెడుతున్నారని, దీన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడి చేసేందుకు సిద్ధం కావాలన్నారు. అడిషనల్‌ డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌, అడిషనల్‌ డీజీపీ గ్రేహౌండ్స్‌ ఆర్కే మీనా, అడిషనల్‌ డీజీపీ బెటాలియన్‌ డాక్టర్‌ శంకబ్రత బాగ్చి, ఎస్‌ఈబీ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని