నేతన్నలకు ఎదురుచూపులే!
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

నేతన్నలకు ఎదురుచూపులే!


వస్త్రాలను నేస్తున్న కార్మికులు

మయూరి కూడలి, న్యూస్‌టుడే నేతన్నలను ఆదుకునేందుకు పరపతి రుణాలను  ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ ఏడాదిలో అర్థ సంవత్సరం దాటినా  మంజూరు చేయలేదు. చేనేత-జౌళిశాఖ ఆధికారులు ఏ సంఘానికి ఎంత రుణం కావాలో బ్యాంకులకు పంపించారు. మూడు సంఘాలకు రూ.62 లక్షలు రుణం కావాలని నేతన్నలు ఇప్పటికే దరఖాస్తు చేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. వాటితో ముడిసరకు కొనుగోలు చేసి వస్త్రాలను తయారు చేసుకోవాలనుకుంటున్నారు. 
ఇదీ పరిస్థితి: చేనేత సంఘాలు జిల్లాలో మొత్తం 18 వరకు ఉన్నాయి. వాటిలో మొత్తం 2100 మంది సభ్యత్వం పొందారు. ఇందులో ఆరు సంఘాలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. వాటిలో గత రెండేళ్ల నుంచి మూడు సంఘాలు మాత్రమే రుణాలను పొందుతున్నాయి. గుర్ల (కోట గండ్రేడు), డెంకాడ (డెంకాడ), రామభద్రపురం (కొట్టక్కి) సంఘాల్లో సుమారు 350 మంది వరకు ఉన్నారు. మిగిలిన సంఘాలు ఆర్థికంగా బలంగా ఉండటంతో సొంతంగా డబ్బుల్ని సమకూర్చుకుని వస్త్రాలను తయారు చేస్తున్నాయి.అప్పులకోసం ఇవి ఎదురుచూడటం లేదు.
వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడో..?: నేతన్నలు బ్యాంకులకు తీసుకున్న అప్పు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ పేరిట తిరిగి చెల్లిస్తుంది. గత రెండేళ్లకు గానూ సుమారు రూ.32 లక్షలు రావాలి. నేతన్నలు బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పు కూడా దాదాపు రూ.60 లక్షల వరకూ ఉంది.

సంఘాలకు రుణాల విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లాం. ఇంకా ఎవరికైనా అప్పు కావాలంటే మంజూరుకు సిఫార్సు చేస్తాం. రెండేళ్లలో కొవిడ్‌ ప్రభావం వల్ల వస్త్రాల తయారీకి ఎవరూ ముందుకు రాలేదు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు ఇస్తారు.
-కె.పెద్దిరాజు, సహాయ సంచాలకుడు, చేనేత అండ్‌ జౌళిశాఖ. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని