close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

28న మౌఖిక పరీక్షలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 28న ఉదయం 10 గంటలకు ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసీబై సంస్థలో ఐదు సీఆర్‌ఈ కొలువులను మౌఖిక పరీక్షల ద్వారా భర్తీ చేస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్‌ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.8 వేల వేతనాన్ని చెల్లిస్తారన్నారు. ● ఈనెల 28న ఉదయం 10 గంటలకు భీమవరంలోని ప్రభుత్వ ఐటీఐలో రాత పరీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్‌’ సంస్థలో అప్రరటీసష్‌ిప్‌ కోసం రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2018, 2019 సంవత్సరాల్లో ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఆర్‌ అండ్‌ ఏసీ, మోటార్‌ మెకానిక్‌ ట్రేడ్‌లు పూర్తిచేసి, 18 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.