
సారూ.. ఈ ఫ్లెక్సీ కట్టింది మీరే!
రాజకీయ నాయకులు మినహా.. మిగిలిన వారు ఏదైనా హామీ ఇవ్వాలంటే వెనుకా ముందు ఆలోచిస్తారు. ఉద్యోగులైతే చాలా తక్కువ. అటువంటిది యలమంచిలి గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి పంచాయతీరాజ్ అధికారులు హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. గతేడాది ప్రారంభించిన పనులు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ మేరకు మండల, జిల్లా స్థాయి అధికారుల చరవాణుల నంబర్లు ఉన్న ఫ్లెక్సీని కట్టడం వద్ద వేలాడదీశారు. ప్రస్తుతం గడువు ముగిసి వారం దాటింది. నిర్మాణం మాత్రం ఇలాగే ఉంది. - న్యూస్టుడే, యలమంచిలి
Tags :