Updated : 11/06/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంగన్‌వాడీల్లోనే ప్రీస్కూళ్లు నడపాలని డిమాండ్‌

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న కార్యకర్తలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీస్కూళ్లు నిర్వహించాలని ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.హైమావతి డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు కోసం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. నూతన విద్యావిధానంతో పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు మధ్యలో అంగన్‌వాడీ కేంద్రాలున్నందున వాటిలోనే ప్రీస్కూళ్లను కొనసాగించాలన్నారు. అంగన్‌వాడీ కార్యర్తలకు నెలకు కనీస వేతనంగా రూ.21,000 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌ మణి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని