AP News: అక్కడ తెదేపాకు ఎంపీపీ.. జనసేనకు వైస్‌ ఎంపీపీ
eenadu telugu news
Published : 24/09/2021 11:06 IST

AP News: అక్కడ తెదేపాకు ఎంపీపీ.. జనసేనకు వైస్‌ ఎంపీపీ

ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. తెదేపాకు ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన సమ్మతించింది. దీంతో జనసేనకు వైస్‌ ఎంపీపీ పదవి ఇచ్చేందుకు తెదేపా అంగీకరించింది. ఆచంటలో తెదేపాకు ఏడుగురు, వైకాపాకు ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అటు తెదేపా, ఇటు వైకాపా తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ క్రమంలో తెదేపా- జనసేన మధ్య సయోధ్య కుదిరింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని