13న నిట్‌ స్నాతకోత్సవం
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

13న నిట్‌ స్నాతకోత్సవం

 

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబరు 13న ద్వితీయ, తృతీయ స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్‌ సీఎస్పీ రావు అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి, ఏపీ నిట్‌ బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ ఛైర్‌పర్సన్‌ మృదుల రమేష్‌ హాజరుకానున్నారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు, కోర్సుల వారీగా ధ్రువపత్రాలు, బంగారు పతకాలను అందజేయనున్నారు. 2019లో నిర్వహించిన తొలి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరై విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేశారు. ఆ తర్వాత ఏడాది కొవిడ్‌ కారణంగా ద్వితీయస్నాతకోత్సవం వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడంతో కార్యక్రమాలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2016-20 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు 381 మంది ఉండగా. 2017-21 బ్యాచ్‌కు సంబంధించి మొత్తం 412 మంది ఉన్నారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులు నవంబరు 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని