నేరాలు అరికట్టేందుకు దృష్టి పెట్టండి : ఎస్పీ
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

నేరాలు అరికట్టేందుకు దృష్టి పెట్టండి : ఎస్పీ


మాట్లాడుతున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేరాలను అరికట్టడంలోనూ కేసులను చేధించి బాధితులకు న్యాయం చేయటంలోనూ పోలీసు అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. జిల్లా నేర సమీక్ష సమావేశాన్ని ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఆయా పోలీసుస్టేషన్‌లకు సంబంధించిన కేసులను, వాటి పురోగతిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చోరీ కేసుల్లో దొంగలను త్వరగా పట్టుకొని, సొత్తు రికవరీ చేయాలన్నారు. జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం రవాణాను అరికట్టాలన్నారు. ఖైనీ, గుట్కాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని, క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రుల్లో చేర్చేందుకు హైవే మొబైలు టీమ్‌లు, గెట్‌వే వాహనాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీపావళి నేపథ్యంలో ఎవరైనా అనుమతులు లేకుండా మందుగుండు సామగ్రి తయారు చేసినా, అమ్మకాలు చేసినా బాణసంచా నిల్వలు కలిగి ఉన్నా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని