Perni Nani: పవన్‌ ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని కౌంటర్‌
eenadu telugu news
Published : 28/09/2021 09:18 IST

Perni Nani: పవన్‌ ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని కౌంటర్‌

అమరావతి: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం ట్విటర్‌లో వేరే స్థాయికి చేరింది. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని