మంగళవారం, డిసెంబర్ 10, 2019
సంప్రదాయబద్ధంగా సీతారాముల కల్యాణోత్సవం
పాల్గొన్న చినజీయర్ స్వామి
పాల్గొన్న భక్తులు
యనకండ్ల (బనగానపల్లి పట్టణం), న్యూస్టుడే: దైవచింతనతోనే ముక్తికి మార్గం లభిస్తుందని ప్రముఖ స్వామీజీ త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నారు. యనకండ్ల గ్రామంలోని జయజ్యోతి సిమెంట్ కర్మాగారంలో వెలసిన సీతారామలక్ష్మణ హనుమ సమేత ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సీతారాముల కల్యాణోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీమన్నారయణ చినజీయార్ స్వామి మాట్లాడుతూ ప్రతిఒక్కరు భక్తిభావంతో ముందుకు సాగినప్పుడే ప్రశాంతమైన జీవనం లభిస్తుందన్నారు. ప్రతివ్యక్తి మానసిక ప్రశాంతతకు భక్తి ఒక మార్గంగా ఉంటుందన్నారు. సీతారాముల ప్రవచనాలు వివరించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ ఇండస్ట్రీస్ అధినేత రామేశ్వరరావు దంపతులు, కుటుంబ సభ్యులు, జయజ్యోతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు