close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

ఆగస్టు హాజరు మాసోత్సవం 

విద్యార్థులు నిత్యం రావడమే లక్ష్యం 
విద్యాశాఖ కార్యాచరణ

పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు తరచుగా గైర్హాజరు అవుతున్నారని గుర్తించి, ఈ పరిస్థితిని చక్కదిద్ది విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని సంకల్పించింది. ఇందుకోసం ఆగస్టులో ‘హాజరు మాసోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించి,   జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో కార్యాచరణ చేపట్టారు. ఇందుకు సంబంధించి అభిప్రాయాలను సేకరించి, త్వరలో పూర్తి స్థాయి ప్రణాళిక తయారు చేసి పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. 
న్యూస్‌టుడే,వికారాబాద్‌ టౌన్‌: జిల్లాలోని 18 మండలాల్లో 1,011 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 82,807 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రధానంగా బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, బంట్వారం, పెద్దేముల్‌, బషీరాబాద్‌, కుల్కచర్ల మండలాల్లో విద్యార్థులు గైర్హాజరవుతున్నారని అధికారులు గుర్తించారు. ఇందుకు కారణం ఈ ఆరు మండలాల నుంచి వలసలు ఎక్కువగా ఉండడమేనని భావిస్తున్నారు.మారుమూల పల్లెలకు చెందిన కుటుంబాలు వలస వెళ్లిన సమయంలో పిల్లలు కూడా వారి వెంటే వెళుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా మరో కారణంగా గుర్తించారు. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉందంటున్నారు. 
కొరవడిన తనిఖీలు: పాఠశాలలను అధికారులు తనిఖీ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. మారుమూల లోపల్లెలకు ఉపాధ్యాయులు వెళ్లడంలేదన్న విమర్శలున్నాయి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కొత్తగా చేపట్టే కార్యక్రమం ద్వారా  గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయనున్నారు. 
నిత్యం వస్తేనే 
ప్రతి విద్యార్థికి విజ్ఞానం పెరగాలంటే   నిత్యం బడికి రావాలి. తరచూ రాకపోవడం వల్లపిల్లలపై ప్రభావం పడుతోంది. పాఠ్యాంశాల్లో వెనకబడే ప్రమాదం కూడా ఉంది. దీనిని అధిగమించాలంటే మార్పు రావాలి. ఈ సందర్భంగానే హాజరుపై దృష్టి సారించి, వారికి అవగాహన కల్పిస్తే క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ఇప్పటికే మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఏఏ మండలాల్లో గైర్హాజరు ఎక్కువగా ఉందో గుర్తించి నివేదికలు ఇవ్వాలని జిల్లా విద్యాధికారిణి ఆదేశించారు. ఆయా  పాఠశాలలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయనున్నారు. 
అంశాలు ఇలా 
ఈ నెల 31వ తేదీన గ్రామాల్లో విద్యావంతులు, తల్లిదండ్రులు, యువతతో చర్చించి విద్యార్థులు ఎందుకు పాఠశాలకు రావడం లేదో చర్చించి గుర్తిస్తారు.బీ పాఠశాలకు ప్రతి రోజు వచ్చే విద్యార్థుల పేర్లను నోటీసు బోర్డుపై ఉంచాలి. పాఠశాలకు తరచూ గైర్హాహాజరు అయ్యే విద్యార్థులకు చూపించి వారు వచ్చేలా చూడాలి. బీ ప్రతి తరగతి గదిలో ఐదు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులను భాగస్వాములను చేస్తారు. విద్యార్థులు బడికి ఎందుకు రావడం లేదో తెలుసుకోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి రప్పిస్తారు. 
ప్రణాళికలను సిద్ధం చేశాం 
-రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి 
ఆగస్టు హాజరు మాసోత్సవానికి సంబంధించి ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. విద్యార్థుల ఎక్కడ గైర్హాజరు అవుతున్నారో గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాం. పూర్తి వివరాలు వచ్చాక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.