close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

ప్రధానాంశాలు

ఉజ్జయిని తల్లి మన మహాకాళి! 

పిడికెడు ప్రసాదానికే కొండంత అండ 
రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక చరిత్ర

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: మనకు వరాలివ్వ మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన తల్లి.. నేడు శ్రీ ఉజ్జయిని మహాకాళిగా విరాజిల్లుతోంది. 204 ఏళ్ల నుంచి ఏటేటా బోనంతోనే సంతృప్తి చెందుతూ చల్లని చూపుచూస్తోంది. నేడు రాష్ట్ర పండగై బోనాల జాతరకు కేంద్రబిందువుగా బాసిల్లుతోంది. అందుకే పేదలు, పెద్దలు అని తేడా లేకుండా అమ్మ సేవలో ఒదిగిపోతున్నారు. జులై21, 22 తేదీల్లో జరిగే బోనాల జాతరకు ఆలయం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆధ్యాత్మిక సన్నిధిపై ప్రత్యేక కథనం. 
సికింద్రాబాద్‌కు చెందిన సురిటి అప్పయ్య మిలిటరీ ఉద్యోగి. 1813లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పని చేశారు. అప్పుడు అక్కడ కలరాసోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. అప్పయ్య ఉజ్జయినీలోని మహాకాళిని దర్శించి కాపాడాలని కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మవారి అంశను సికింద్రాబాద్‌కు తెచ్చి, ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నారు. పరిస్థితులు బాగవడంతో 1815లో సికింద్రాబాద్‌లో అమ్మవారిని ప్రతిష్ఠించారు.

 

నగరంపై అమ్మ చల్లని చూపు

* కర్భలా మైదానం కూడలి:  ఇక్కడి నుంచే అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉంటుంది. 
* బోయిగూడ: అమ్మవారి పుట్టిల్లుగా కొనసాగుతోంది. చివరిరోజు ఇక్కడి భక్తులకు మహాకాళి దర్శనం లభిస్తుంది. 
* మెట్టుగూడ: బోనాల జాతర ఉత్సవాల్లో చివరిదైన ‘సాగనంపు’ ఇక్కడే పూర్తవుతుంది.  
* ఘటం యాత్ర: సికింద్రాబాద్‌లోని హిమాంబావి, నల్లగుట్ట, పాన్‌బజార్‌, ఓల్డ్‌బోయిగూడ, రంగ్రేజీబజార్‌, ఉప్పర్‌బస్తీ, చిలకలగూడ, కుమ్మరిగూడ, రెజిమెంటల్‌బజార్‌ బోయిగూడ, బన్సీలాల్‌పేట ప్రాంతాల్లో ఘటం దర్శనమిస్తుంది.

నేడు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ 

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో నేడు మినీ జాతర ఉంటుంది. ఉత్సవాలకు ముందు శుక్రవారం, జాతరకు ఒకే రోజు సమయం ఉండడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. ఈ సమయంలో మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందు కోసం ఆలయంలోని మహామండపంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ ఎస్‌.అన్నపూర్ణ తెలిపారు.

మహాకాళి ఆలయం వద్ద 240 సీసీ కెమెరాలతో నిఘా 
డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ వెల్లడి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఉజ్జయినీ మహాకాళి బోనాలు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగే మహాకాళి జాతర మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారనే అంచనా నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జాతర ఏర్పాట్లపై గురువారం డీసీపీ విలేకరులతో మాట్లాడారు. 240కు పైగా సీసీ కెమెరాల నిఘాతో పాటు 2,500 మంది పోలీసులతో పెద్ద ఎత్తున మోహరించి భద్రతను చేపడుతారని పేర్కొన్నారు. మహంకాళి ఠాణాలో తాత్కాలికంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జనరల్‌ బజార్‌ వైపు వీఐపీల పాస్‌లకు సంబంధించిన క్యూలైన్‌ ఉంటుందని అందులో వచ్చే వారికి బార్‌కోడ్‌తో ఉన్న ప్ల్లాస్టిక్‌ కార్డులను ఆలయం నుంచి అందజేస్తున్నారని వాటిని పరిశీలించి పంపిస్తామని చెప్పారు.పోలీసుస్టేషన్‌ వద్దనే ఉచిత వైద్యశిబిరం ఉంటుందని, అవసరమైన వారికి వైద్యం అందిస్తారని తెలియజేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.