close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

ప్రధానాంశాలు

ఈ రెండు రోజుల్లో ఏం జరగొచ్చు?

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : కర్ణాటక రాజకీయాన్ని యావత్తు దేశమంతా వీక్షిస్తోంది. ఎప్పటికీ తేలదని గుర్తించాకే గవర్నర్‌ ఇక్కడి వ్యవహారాలపై జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ జోక్యంపై సందేహాలున్నా.. ఆయన జోక్యం అసంబద్ధం మాత్రం కాదని ప్రజలే గుర్తించే స్థాయి వచ్చింది. తమ ఎమ్మెల్యేలను కంటి ముందే ఎగరేసుకుపోతుంటే ఏ పార్టీయైనా ఏం చేయగలదో అదే చేశాయి మిత్రపక్షాలు. సాంకేతికతంగా మా బలం సుస్పష్టమని చెబుతున్న భాజపా మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పింది కాదు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని రాష్ట్రపతి భవన్‌, కేంద్ర హోం శాఖలు ఓ కంట కనిపెడుతున్నాయి. సోమవారం దాకా రాష్ట్ర రాజకీయాల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్ఛు

సుప్రీంకోర్టు స్పందన

ఇప్పటికే కోర్టు తీర్పును ప్రశ్నిస్తూ మిత్రపక్షాలు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశాయి. నేడు కోర్టుకు పనిదినమే కావటంతో కర్ణాటక రాజకీయాల నేపథ్యంలో స్వీకరించిన అర్జీలపై స్పందన వెల్లడి కావచ్ఛు ఎమ్మెల్యేల రాజీనామాల అంశం కొలిక్కి వచ్చింది. విప్‌ నిబంధనలు, ముఖ్యమంత్రికి గవర్నర్‌ ఆదేశాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఈ రెండు రోజుల్లో వినే వీలుంది.

*●రెండు రోజుల సమయాన్ని ఎలాగోలా సాధించికున్న మిత్రపక్షాలు ఈ రెండు రోజుల్లో తమ సహచరులను దారికి తెచ్చుకునే వీలుంది. ఇప్పటికే ఆ దారులన్నీ మూసుకుపోయినా.. ప్రయత్నాలు మాత్రం కొనసాగించే అవకాశాలున్నాయి. మళ్లీ రిసార్టులకు తరలిన మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఈ రెండు రోజుల్లో చివరి ప్రయత్నంగా అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలు చేయొచ్ఛు మరో వైపు భాజపా మాత్రం చేయాల్సిందల్లా చేసి అసలైన సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం తప్ప చేయాల్సింది ఏమీ లేదు. గవర్నర్‌తో ఇప్పటికే పలుమార్లు మనవి పత్రాలు సమర్పించిన ప్రతిపక్షం వారి ఎమ్మెల్యేలను మరింత భద్రంగా కాపాడుకుని సోమవారం హాజరు కావటం. ఇప్పటికే స్పీకర్‌ ఇచ్చిన మాట మేరకు విశ్వాస పరీక్షకు పట్టుబట్టడం మాత్రమే చేయగలదు.

*●గవర్నర్‌ ఇప్పటికే కేంద్ర హోం శాఖకు రాష్ట్ర పరిస్థితులపై నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా శనివారం కేంద్ర రాజకీయ వ్యవహారాల సమితి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమితి రాష్ట్ర పరిస్థితులపై ఓ ప్రకటన చేయొచ్ఛు ఇప్పటికే రెండుసార్లు ఆదేశాలు పంపిన గవర్నర్‌ ఈ సోమవారం దాకా ఏం చేస్తారన్నది ఆసక్తికరం. భాజపా బృందం తనను కలిసిన ప్రతిసారీ ఏదో ఒక భరోసా కల్పించే గవర్నర్‌ సోమవారం దాకా తన తదుపరి చర్యలపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశాలు కూడా ఇదే సందర్భంగా పరిశీలించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు

వితరణ కాలువలకు నీటి విడుదల

వితరణ కాలువలకు నీరు విడుదలైంది. తుంగభద్ర జలాశయం నిండి 11 రోజులైనా ఎడమ కాలువకు గండి పడడం, గేట్‌ మరమ్మతుల వల్ల నీటి విడుదల జాప్యమైంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోని రైతులు జూన్‌లో వరి నారు పోశారు. జులై చివరి వారం నుంచే తుంగభద్ర కాలువ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. జలాశయంలోకి నీరు ఆలస్యంగా రావడం, కాలువ మరమ్మతుల వల్ల ఆగస్టు చివరి వారం నీరు వచ్చింది. నాట్లకు ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైంది. ఈ ప్రాంతంలో సరైన వర్షాలు కురవక భూమి తడవలేదు. కేవలం కాలువ నీటితోనే నాట్లు వేయడం కష్టమవుతుంది. చివరి ఆయకట్టులో సెప్టెంబరు చివరి వారంలో నాట్లు వేసే అవకాశం

తాజా వార్తలు

హస్తినలో కమలనాథుల సందడి

భాజపా కర్ణాటక శాఖకు అధ్యక్షుడిగా నియమితులైన లోక్‌సభ సభ్యుడు నళిన్‌ కుమార్‌ కటిల్‌ గురువారం హస్తినకు చేరుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి బి.ఎల్‌.సంతోశ్, పార్టీ వ్యవహారాల బాధ్యుడు పి.మురళీధరరావుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మంగళవారం రాత్రి ఆయనను అధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చే ముందుగా ఆయన కేంద్ర నాయకులను కలుసుకున్నారు. అమిత్‌షా, జె.పి.నడ్డాలను కలుసుకుని వివిధ అంశాలతో చర్చించిన మీదట ఆయన నగరానికి తిరిగి వస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నూతన మంత్రి డాక్టర్‌ అశ్వర్థ

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.