close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

గంగమ్మతల్లికి బోనాల ఉత్సవం  

 

 

తిమ్మాపురం, (మహానంది), న్యూస్‌టుడే: ఎం.తిమ్మాపురం, అబ్బీపురం గ్రామాల్లోని భక్తులంతా ఆదివారం గంగమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రజకులంతా కలిసి ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో చేశారు. వర్షం కురిపించి సమస్త జీవరాశులను ఆదుకోవాలని మహిళా భక్తులు వేడుకుంటూ బోనాలను మోశారు. ఊరి చివరలోని చెట్టు కింద ఉన్న గంగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు.

వెలుగోడు (బండిఆత్మకూరు), న్యూస్‌టుడే: వెలుగోడు మండలంలోని అబ్దుల్లాపురం గ్రామంలో గ్రామస్థులు ఆదివారం వర్షం కోసం పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఆలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నా, పెద్ద తేడా లేకుండా బిందెలతో నీటిని తీసుకువచ్చి దేవుళ్లకు అభిషేకం చేశారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.