close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ప్రమాద బాధితుల పరిరక్షణకు ఉద్యమించాలి

పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే : వివిధ ప్రమాదాల కారణంగా తమవారిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధితుల పరిరక్షణకు ప్రజాసంఘాలు, విద్యావంతులు, మేధావులు ఉద్యమించాల్సిన అవసరముందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనరు ఎం.రాఘవాచారి అన్నారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మీదుగా వెళ్లే 44వ నంబరు జాతీయ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. ప్రమాదాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలతో చనిపోయేవారి కుటుంబాలకు ప్రభుత్వమే బాసటగా ఉంటూ అన్ని విధాలా ఆదుకునేలా చట్టం తీసుకురావాలన్నారు. తీలేరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రమాద బాధితులకు 30 ఏళ్లపాటు అన్ని వసతులతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు పర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. నల్లమల ప్రాంతంలో ఎన్నో అనర్థాలకు కారణమయ్యే యురేనియం తవ్వకాల ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే చేపట్టాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అవసరమయ్యే తాగు, సాగునీటిని జూరాల ప్రాజెక్టు నుంచి ఉపయోగించుకునేలా మరో ప్రత్యేక నీటినిల్వ ప్రాజెక్టును నిర్మించాలన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు బుచ్చన్నయాదవ్‌, శాంతన్న, వెంకటేశ్వర్లు, ఐ.నారాయణ, స్వామి, నిరంజన్‌, వేణుగోపాల్‌నాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.