close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

మన శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లో చంద్రయాన్‌ 2 స్పేస్‌ షో ప్రారంభం

నారాయణగూడ, న్యూస్‌టుడే: మన దేశ శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారని, చంద్రయాన్‌-2 వంటి ప్రయోగాలు చేపడుతున్న వారి ప్రతిభకు, సాహసానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నగరంలోని బీఎం బిర్ల్లా సైన్స్‌ సెంటర్‌ నక్షత్రశాలలో నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీ ‘డిజీస్టార్‌’ విధానంతో ఆధునికీకరించిన గోటో ఎలక్ట్రోమెకానికల్‌ ప్రోజెక్టర్‌ (డిజిటల్‌) ద్వారా ‘చంద్రయాన్‌-2 కాన్సెప్ట్‌’ ప్రదర్శనను గవర్నర్‌ సోమవారం ప్రారంభించారు. దాదాపు 45 నిమిషాల నిడివిగల ఈ ప్రదర్శనను గవర్నర్‌ ఆసక్తిగా తిలకించారు. బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా.బి.జి.సిద్ధార్థ ఈ ప్రదర్శనశాల గురించి గవర్నర్‌కు వివరించారు.

ఆధునిక సాంకేతికతతో.. నక్షత్రశాలలో నిన్నటివరకు 1960 దశకం నాటి సాంకేతిక పరిజ్ఞానం, ప్రొజెక్టర్‌తోనే ప్రదర్శనలు జరిగాయి. తాజాగా దాదాపు రూ.4 కోట్లతో అధునాతన సాంకేతికతతో ఆధునికీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి నక్షత్రశాల అని సెంటర్‌ డైరెక్టర్‌ చెప్పారు. తెరపై (డోమ్‌)పై ఇకనుంచి కంప్యూటర్‌ గ్రాఫిక్‌తో సృష్టించిన డిజిటల్‌ దృశ్యాలను చూసే అవకాశం కలుగుతుంది. అద్భుత, అరుదైన ఖగోళ వింతలు, విశేషాల దృశ్యాలు మన కళ్లముందు కదలాడుతున్నట్టు ఉంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.