close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నేటి నుంచి కాలభైరవ స్వామి ఉత్సవాలు

ముస్తాబైన ఆలయం (అంతరంలో గర్భగుడిలోని కాలభైరవ స్వామి)

ఇస్సన్నపల్లి(రామారెడ్డి), న్యూస్‌టుడే: కాలభైరవస్వామి భక్తుల ఇష్ట దైవంగా, స్థానికుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నారు. స్వామి సన్నిధానంలో ఉంటే వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇస్సన్నపల్లి, రామారెడ్డిలోని కాలభైరవస్వామి జన్మదిన వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యహవచనం, కంకణధారణ, సంతతధారాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ గణపతి హోమం, రుద్రహవనం, బలిహరణం పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 6 గంటల నుంచి సంతత ధారాభిషేకం మొదలవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు బద్ధి పోచమ్మ అమ్మవారికి బోనాలు తీస్తారు. 18న సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన కార్యక్రమం, 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 19న తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు, 20న ఉదయం 6 గంటలకు సంతతధారాభిషేకం సమాప్తి, 7 గంటల నుంచి ధ్వజారోహణం, మహాపూజ, దక్షయజ్ఞ కార్యక్రమం, మధ్యాహ్నం ఒంటి గంటకు సిందూరపూజ, 3 గంటలకు డోలారోహణం(తొట్లె జన్మదినం), అన్నదానం, సాయంత్రం 5 గంటలకు ఎడ్లబండ్ల ఊరేగింపు, రాత్రి 8 గంటలకు భద్రకాళి పూజ నిర్వహిస్తారు. గురువారం మధ్నాహ్నం 2 గంటలకు రథోత్సవం, 6 గంటలకు దక్షయజ్ఞము(అగ్ని గుండాలు), నాతికన 8 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఏర్పాట్లు పూర్తి : గంజి సతీష్‌, ఆలయ ఛైర్మన్‌

భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, స్నాన వాటికలు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.