close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఉపన్యాస పోటీలతో నాయకత్వ లక్షణాలు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఉపన్యాస పోటీలు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రఘువీర్‌సింగ్‌ పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానాన్ని ప్రసాదించేందుకు గ్రంథాలయాలు దోహదపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధనతో ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. పలు పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేందర్‌కుమార్‌, సీఆర్పీలు వెంకటేశ్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.