సోమవారం, డిసెంబర్ 09, 2019
విద్యార్థికి ధ్రువపత్రాన్ని అందజేస్తున్న అధికారులు
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: సాంకేతిక కోర్సులతో ఉపాధి సులువుగా దక్కించుకొనే అవకాశం ఉందని జిల్లా ఆరోగ్యశాఖాధికారి చలపతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శ్రావణి పారిశ్రామిక శిక్షణ సంస్థ కేంద్రంలో విద్యార్థులకు పట్టాల(కాన్వకేషన్) ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక అంశాలపై మక్కువ పెంచుకుంటే భవిష్యత్లో చక్కగా రాణించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ గంగాభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు