close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఏకరూపం.. బహుదూరం

విద్యా సంవత్సరం సగం పూర్తి

ఇంకా అందని దుస్తులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో పరిస్థితి

న్యూస్‌టుడే, బాన్సువాడ

ఇంటి నుంచి తెచ్చుకొన్న దుస్తులు వొసేుకొన్న ఎస్సీ వసతిగృహం విద్యార్థులు

విద్యార్థుల సంక్షేమం కోసం వసతి గృహాలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులే ఇందులో చేరి విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా సంవత్సరం సగం పూర్తయినా ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహ విద్యార్థులకు ఏకరూప దస్తులు పంపిణీ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో పాత దుస్తులతోనే నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. ఎస్సీ, బీసీ వసతిగృహాలకు ఇప్పటికీ సామగ్రి చేరకపోగా ఎస్టీ వసతి గృహానికి ఇటీవలే మెటీరియల్‌ రావడంతో కుట్టడానికి ఇచ్చారు.

జిల్లాలో మొత్తం 60 వసతిగృహాలున్నాయి. ఇందులో బీసీ 18, ఎస్టీ 11, ఎస్సీ 31 ఉన్నాయి. సుమారు 7 వేల మంది విద్యార్థులు ఇందులో ఉంటారు. ప్రభుత్వం ప్రతి ఏడాది వీరికి నాలుగు జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తుంది. రెండు జతలు పాఠశాల యునిఫాంలు కాగా మరో రెండు వసతిగృహాల్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇస్తారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలకు ఇప్పటికీ దుస్తులు రాకపోగా పది రోజుల క్రితమే ఎస్టీ వసతిగృహామెటీరియల్‌ వచ్చింది. దీనిని కుట్టడానికి ఇస్తే కనీసం నెల రోజులు పడుతుంది. అంటే దాదాపుగా ఈ నెలలో కూడా విద్యార్థులకు పంపిణీ చేసే అవకాశం లేదు. జనవరిలో అందిస్తే మరో మూడు నెలలు కూడా పాఠశాల కొనసాగే పరిస్థితి ఉండదు. అధికారుల ముందస్తు చూపు లేకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది.

గతేడాది పంపిణీ చేసిన ఏకరూప దుస్తులతో బాన్సువాడ ఎస్టీ వసతిగృహ విద్యార్థినులు

పదో తరగతి విద్యార్థులకు..

తొమ్మిదో తరగతిలోపు విద్యార్థులకు జనవరిలో అందజేసినా కనీసం వచ్చే ఏడాదైనా వేసుకొనే అవకాశం ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు అందజేస్తే కేవలం మూడు నెలలు మాత్రమే వేసుకొంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సుమారు 650 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అంటే వీరికి 2,600 ఏకరూప దుస్తులు ఇవ్వనున్నారు. వీరు ఇంటర్‌లో చేరాక ఏకరూప దుస్తులను వేసుకొనే పరిస్థితి ఉండదు.

ఆలస్యమైంది వాస్తవమే

-ఝాన్సీరాణి, బీసీ సంక్షేమశాఖ అధికారిణి

ప్రతిపాదనలు ఎప్పుడో పంపిచాం. పై నుంచి మెటీరియల్‌ రావడమే ఆలస్యమైంది. జిల్లా కేంద్రానికి వచ్చిన వాటిని వసతి గృహాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా కుట్టించి విద్యార్థులకు దుస్తులు అందేలా చూస్తాం. ఈ నెల 25వ తేదీ లోపు ఇవ్వాలని నిర్ణయించుకొన్నాం. గత ఏడాది అందించిన వాటినే విద్యార్థులు వేసుకొంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.