close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

ముహూర్తం ఖరారు

● 24న ఏపీ నిట్‌ తొలి స్నాతకోత్సవం

● హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

● ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ఏపీ నిట్‌ ముఖద్వారం

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పీ నిట్‌ తొలి స్నాతకోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శాశ్వత ప్రాంగణంలో ఈ నెల 24న నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. తొలి స్నాతకోత్సవం కావడంతో విద్యార్థులకు కలకాలం గుర్తుండిపోయేలా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సంస్థ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న విమానాశ్రయ రన్‌వే మధ్యలో విభాజకాన్ని తీర్చిదిద్దారు. అటూఇటూ ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటుచేయడంతోపాటు మధ్యలో అందమైన పలు రకాల మొక్కలను తీర్చిదిద్దుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడంతోపాటు కోర్సుల వారీగా అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయనున్నారు.

376 మందికి డిగ్రీలు ప్రదానం

ప్రతిష్ఠాత్మక ఏపీ నిట్‌ను తాడేపల్లిగూడేనికి 2015లో మంజూరుచేశారు. మొత్తం ఎనిమిది కోర్సులు నిర్వహిస్తుండగా 486 సీట్లను కేటాయించారు. ఇందులో 243 సీట్లను రాష్ట్ర విద్యార్థులతో మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం పెదతాడేపల్లిలోని వాసవి, ప్రత్తిపాడులోని ఆకుల గోపయ్య ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తాత్కాలిక తరగతులను, వసతి గృహాలను సంస్థ శాశ్వత ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు సంవత్సరాల విద్యార్థులతో కలిపి మొత్తం 1721 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో బాలురు 1224 మంది, బాలికలు 497 మంది ఉన్నారు. బంగ్లాదేశ్‌, ఇథియోపియా, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చేరారు. వీరికి అదనంగా పీహెచ్‌డీ కోర్సులు చేసే విద్యార్థులున్నారు. సంస్థను ప్రారంభించి ఐదేళ్లు గడుస్తుండటంతో ఓ బ్యాచ్‌ విద్యార్థులు (376 మంది) కోర్సులను పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయారు. వారందరికి స్నాతకోత్సవంలో డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. దీనికితోడు మొత్తం ఎనిమిది కోర్సుల్లో అద్భుత ప్రతిభ చాటిన ఒక్కో విద్యార్థికి బంగారు పతకంతోపాటు ఆ ఏడాదిలో అందరి కంటే ఎక్కువ గ్రేడు పాయింట్లు సాధించిన విద్యార్థికి మరో బంగారు పతకం అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.