close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిండుగా నిధులు... సాగాలి పనులు

పంచాయతీలకు కాసుల వరద!

పది నెలల్లో రూ.123.70కోట్లు

ప్రథమ పౌరులదే బాధ్యత

కరణ్‌కోటలో నిర్మించిన కాల్వ

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందుకోసం నిరంతరం నిధులు అందిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా పనులు జరిగేందుకు అధికారులను అప్రమత్తం చేస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతినెలా పంచాయతీలకు నిధులు మంజూరు చేసోంది. ఇలా గడిచిన పది నెలల్లో రూ.123.70కోట్లు ఖాతాల్లో జమయ్యాయి. వీటితో కొన్ని పంచాయతీలు ప్రగతిపథంలో పయనిస్తుంటే మరికొన్ని చోట్ల పాలకవర్గాల నిర్లక్ష్యంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. ప్రజా ప్రతినిధులు చొరవచూపితే నెమ్మదిగా సాగుతున్న పనుల్లో సైతం వేగం పుంజుకుని అభివృద్ధి దిశగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

ల్లాలో రెండేళ్ల క్రితం 365 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో స్థానిక సంస్థల పునర్విభజనలో భాగంగా 201 కొత్తవి ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం 18 మండలాల్లో పంచాయతీల సంఖ్య 566కు పెరిగింది. వాటికి ఎన్నికలు నిర్వహించి పాలనా బాధ్యతలు పాలకవర్గాలకు అప్పగించడంతో పాటు పంచాయతీకి ఒకరు చొప్పున కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరందరి భాగస్వామ్యంతో గతేడాది సెప్టెంబరులో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.

అధికారమిచ్చారు...

పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. జనాభా ప్రాతిపదికన మంజూరయ్యే 14వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తోంది. మరోవైపు పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, కర్మాగారాల నుంచి పన్నుల రూపంలో అదనపు ఆదాయం సమకూరుతోంది. వీటిని ఆయా గ్రామాల్లో ఖర్చు చేసే అధికారం సర్పంచి, ఉపసర్పంచులకు అప్పగించారు.

బెల్కటూరులో సీసీ రహదారి నిర్మించాల్సిన వీధి

కొన్నిచోట్ల వేగం...

తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సర్పంచుల చొరవ కారణంగా అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, తాగునీటి బోరు మోటార్ల ఏర్పాటు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వంటి పనులు నిత్యం కొనసాగుతున్నాయి. వైకుంఠ ధామం, చెత్త దిబ్బల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు వేగంగా సాగుతున్నాయి.

వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు: రూ. 52,48,95,591

14వ ఆర్థిక సంఘం నిధులు: రూ.55,10,53,810

ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.3,74,46,100

పనితీరు ఆధారంగా వచ్చినవి: రూ.3,81,65,100

ఎస్సీ ఉప ప్రణాళిక కింద..: రూ.8,55,09,400

కొన్ని చోట్ల ఇలా..

కొన్ని పంచాయతీల్లో సర్పంచుల అలసత్వంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు.ఇందుకు కొన్ని ఉదాహరణలు...

* ఐనెల్లిలో కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు సీసీ రహదారులపై చేరి రాకపోకలకు అసౌకర్యంగా ఉంటోంది.

* బెల్కటూరు ఎస్సీ కాలనీ, చెంగెష్‌పూర్‌ బోనమ్మ కాలనీల్లో సిమెంటు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి.

* రాంపూర్‌, వీరారెడ్డిపల్లిలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

* మల్కాపూర్‌లో కొన్ని స్తంభాలకు వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళ అంధకారం నెలకొంటోంది.

* కరణ్‌కోటలో పుస్తక నిక్షిప్త కేంద్రానికి సొంత భవనం నిర్మించకపోవడంతో ఐదేళ్లుగా టెంట్‌హౌస్‌లో నెట్టుకొస్తున్నారు.

* ఓగీపూర్‌లో ప్రధాన మార్గంలో సిమెంటు రహదారి ఆధ్వానంగా ఉంది.


అందరూ భాగస్థులు కావాలి

గ్రామంలో అభివృద్ధిపై సర్పంచి, ఉపసర్పంచి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు సమావేశమై చర్చించి ఆచరణలో పెట్టాలి. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. ఎక్కడైనా మొక్కుబడిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయా గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- చంద్రశేఖర్‌రావు, డీఎల్‌పీఓ, తాండూరు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.