close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా’

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న

సీఆర్పీల హక్కుల సాధన సంఘం నాయకులు

 కడప విద్య, న్యూస్‌టుడే: ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయాన్ని ఇడుపులపాయ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉర్దూ ఐకాస నాయకులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐకాస నాయకులు రాష్ట్రంలో ఉన్నతీకరించిన 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 660 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టకపోవడంతో ఆయా పాఠశాలల్లో ఇబ్బందులు తప్పడం లేదని వివరించారు. అనంతరం ఎమ్మెల్సీకి జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
*ఉన్నతీకరించిన 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 660 ఉర్దూ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీచేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ఉర్దూ జేఏసీ పిలుపు మేరకు నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కడప, ప్రొద్దుటూరు ఉప విద్యాధికారి వరలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని వినతి
కడప విద్య : సమగ్రశిక్ష విభాగం స్కూల్‌కాంప్లెక్స్‌ పరిధిలో పనిచేస్తున్న క్లస్టర్‌ రీసోర్స్‌పర్సన్స్‌ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మంగళవారం కడప నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డికి సీఆర్పీల హక్కుల సాధన సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిమూలంశంకర్‌ మాట్లాడుతూ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, జీవిత, ఆరోగ్య భద్రత కోసం ఈపీఎఫ్, ఈఎస్‌ఐ మంజూరు చేయాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రతి సీఆర్పీకి ట్యాబ్, నెలకు రూ.3వేలు ఎఫ్‌టీఏ ఇవ్వాలని, అన్ని రకాల ఖాళీ పోస్టులలో నియామకాలు చేపట్టాలని డిమాండ్స్‌ వివరించారు. సీఆర్పీలు సుభాషిణి, రామ్మోహన్, వెంకటాద్రి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. 
ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలి
కడప విద్య : రాష్ట్రంలో ఉన్నతీకరించిన 220 ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 660 ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నగరంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ పోస్టులు లేక ఆయా ఉర్దూ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోస్టులను భర్తీచేసి ఉర్దూ భాషాభివృద్ధికి కృషిచేయాలని డిమాండ్‌చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలగంగిరెడ్డి, ఇలియాస్‌బాషా, నాయకులు మహబూబ్‌బాషా, అయూబ్, షాబుద్దీన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.