close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నత్తనడకన నిర్మాణ పనులు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి


పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 60 శాతం పూర్తయిన మాతాశిశు సంరక్షణ కేంద్రం

రిపాలన సజావుగా సాగాలంటే అందుకు తగ్గట్లు మౌలిక వసతులు సమృద్ధిగా ఉండాలి. జిల్లాల పునర్విభజన తర్వాత పాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో ప్రధాన పరిపాలన భవనాలు, ఆసుపత్రులను విరివిగా నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందుకు స్థలసేకరణ, గతంలో ఉన్న స్థలంలోనే కొత్త భవన నిర్మాణ పనులు చేసేందుకు అన్నీ నిధులు సమకూర్చింది. జిల్లా పాలనా ప్రాంగణాన్ని అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మాతాశిశు సంరక్షణ కేంద్రం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహాలను రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌లు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో కొంత వేగంగా నిర్మాణ పనులు జరిగినప్పటికీ గుత్తేదారులకు బిల్లుల మంజూరు విషయంలో కొంత స్తబ్థత నెలకొనడం, ఇసుక, కంకర లభ్యత లేకపోవడం మూలంగా కొన్ని నెలలు వాయిదా పడ్డాయి. మంత్రుల చొరవతో తిరిగి పనులు ప్రారంభిస్తున్న సమయంలో కరోనా మహమ్మారి చుట్టుముట్టడంతో మళ్లీ పనులు మొదటికొచ్చాయి. జిల్లాలో నిర్మాణం అవుతున్న మూడు ప్రధాన భవన నిర్మాణాలపై కథనం.

దసరా నాటికి సిద్ధమయ్యేనా..?

జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ, పెద్దకల్వల క్యాంపులో ఉన్న 21 ఎకరాల స్థలం కేటాయించి 2017 అక్టోబరులో కలెక్టరేట్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. గత ఏడాదే కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ల క్యాంపు కార్యాలయాలు ప్రారంభం కావడంతో వారు గృహప్రవేశం కూడా చేశారు. క్యాంపు కార్యాలయాలతో అనుసంధానంగానే ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం రూ.36 కోట్లతో 1.20 లక్షల చదరపు అడుగుల స్థలంలో మూడంతస్థులతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇక వీటిల్లో ఏ, బీ, సీ, డీ బ్లాకులకు మొత్తం 35 గదుల నిర్మాణాలు, శ్లాబులు, గదులకు ఫ్లోరింగ్‌, పాలిషీంగ్‌, వైర్‌ ఫిట్టింగ్‌, ప్లాస్టరింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఇంకా 10 శాతం పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులకు ఇతర రాష్ట్రాల కూలీలను ఉపయోగించేవారు. కరోనా కారణంగా వారంతా స్వగ్రామాలకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి.

జిల్లా కేంద్రంలో 50 శాతం పూర్తయిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం

అత్యాధునిక వైద్యం.. మరింత ఆలస్యం

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి భవన సముదాయంలోనే మూడంతస్థుల సువిశాలమైన భవనంలో అత్యాధునిక వైద్య, శస్త్ర, రక్త, ఇతర చికిత్సలు, నిర్ధారణ కేంద్రాలతో పాటు ప్రసూతి, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుకు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2018లోనే నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ నిధుల లేమి, కూలీల కొరత, ఎన్నికల నిర్వహణ దృష్ట్యా వాయిదా పడ్డాయి. గతేడాది అక్టోబరు నెలాఖరులోగా నిర్మించి ఇవ్వాలని మంత్రి ఈటల, తెలంగాణ మెడికల్‌ సర్వీస్‌, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అధికారులు గుత్తేదారులను ఆదేశించినప్పటికీ 60 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలిసే పరిస్థితులు కనిపించడం లేదు.

అతిథి గృహం ఆరంభం ఎన్నడో..!

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రహదారి, భవనాల శాఖ ఆధ్వర్యంలో అతిథి గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని రెండున్నర ఏళ్ల నుంచి నిర్మిస్తూనే ఉన్నారు. 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఎస్‌ఈ, ఈఈ స్థాయి అధికారులే జిల్లా తరపున అదనపు పర్యవేక్షక బాధ్యతలు చేపడుతుండటంతో ఈ భవన నిర్మాణ పురోగతిపై పట్టింపు కరవైంది. దీనికి తోడు కరోనా వ్యాప్తి కారణంగా కూలీలు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఏడాది లోగా పూర్తి చేయడం కష్టమేనని స్పష్టమవుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.