close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామాల్లో కరోనా

వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడలో మంగళవారం 69 మందికి కరోనా రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌గా తేలినట్లు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు మానస తెలిపారు. పట్టణంలో 11మందికి, ఆరోగ్యకేంద్రం పరిధిలోని గ్రామాల్లో మూడు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా రాపిడ్‌ పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిని సుభాషిని తెలిపారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 39 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

పోత్గల్‌ (ముస్తాబాద్‌), న్యూస్‌టుడే: ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి సంజీవరెడ్డి మంగళవారం తెలిపారు. 19 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు.

బోయినపల్లి : దేశాయపల్లి, జగ్గారావుపల్లిలో 65మందికి మంగళవారం కరోనా రాపిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు నోడల్‌ అధికారి శ్రీఖర్‌ తెలిపారు. ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని చెప్పారు.

కోనరావుపేట : కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌-19 పరీక్షలు మంగళవారం నిర్వహించినట్లు వైద్యాధికారి మోహనకృష్ణ తెలిపారు. 56 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.

గంభీరావుపేట, న్యూస్‌టుడే: గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో 38 మందికి, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో 39 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను మంగళవారం నిర్వహించామని మండల వైద్యాధికారి వెంకటేష్‌ తెలిపారు. ఇందులో పదిమందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం 64 మందికి రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ ధర్మనాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.