close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

పోలీసు వాహనం ఢీ..వ్యక్తి మృతి

హైదరాబాద్‌: పోలీసు వాహనం ఢీ కొట్టడంతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్మన్‌ఘాట్‌లోని శుభోధయ్‌ కాలనీకు చెందిన చందర్‌రావు (32) ఘట్‌కేసర్‌లోని ఓ నర్సరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఉప్పల్‌లోని స్టేడియం-మెట్రోస్టేషన్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌(డీఐ) వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామచందర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. డ్రైవర్‌పై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని హెడ్‌క్వార్టర్‌కు తరలించినట్లు ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.