close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

అందరికీి అందుబాటులోకి ఇసుక


మాట్లాడుతున్న జేసీ వినోద్‌, చిత్రంలో తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌ సదాభార్గవి

 

నెల్లూరు (ఇరిగేషన్‌), న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వినోద్‌ తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌, మైన్స్‌, ఎంపీఎండీసీ అధికారులతో కలిసి జేసీ మాట్లాడారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 12 రీచ్‌లలో వర్షాలతో 8 రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. 8స్టాక్‌ యార్డులకు 6యార్డుల నుంచి మాత్రమే ప్రస్తుతం ఇసుక సరఫరా జరుగుతుందని జేసీ వివరించారు. పెన్నా పరివాహక ప్రాంతంలో కొత్తగా మరో 5రీచ్‌లను ఎంపిక చేశామన్నారు. కలువాయి మండలంలోని పెన్నాబద్దెవోలు, పోదలకూరు మండలం సూరాయిపాళెం, ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం, ఇందుకూరుపేట మండలంలోని నాగరాజుతోపు, పల్లిపాడు ప్రాంతాల్లో కొత్త రీచ్‌లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. సమావేశంలో మైన్స్‌ ఏడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం : రస్తోగి

నెల్లూరు(వీఆర్సీ సెంటరు) : నూతన ఇసుక పాలసీ అమలులో భాగంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర, అంతర్‌ జిల్లాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో ఎనిమిది తనిఖీ కేంద్రాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం తడ, జొన్నవాడ-బద్వేల్‌, సంగం-సోమశిల, నెలబల్లి వద్ద నాయుడుపేట-శ్రీకాళహస్తి, వెంకటగిరి-ఏర్పేడు, శ్రీసిటీ- సెజ్‌పాయింట్‌, తాటిపర్తి-వరదాయపాళెం, ఆత్మకూరు-మర్రిపాడు ప్రాంతాల్లో 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు గ్రామీణంలో పొట్టేపాళెం వద్ద, విడవలూరు మండలంలో ముదివర్తి, బుచ్చిరెడ్డిపాళెంలో జొన్నవాడ, వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ, నాయుడుపేట మండలం పాలచ్చూరు ఆయకట్టు వద్ద, కోట మండలం కోట ఆయకట్టు, చిల్లకూరు మండలం చింతవరం, పొదలకూరు మండలం విరువూరు, అనంతసాగరం మండలం పడమటికంభంపాడులో తనిఖీలు ఉంటాయన్నారు. వీటి పరిధిలో అక్టోబరు 29 నుంచి పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తారన్నారు. చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బంది ఇసుక నూతన విధి విధానాలను అనుసరించి రెవెన్యూ శాఖ జారీ చేసిన పత్రాలు తనిఖీ చేస్తారన్నారు. నూతన విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 117 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 128 ట్రాక్టర్లు, 109 లారీలు, 19 టిప్పర్లు, 2 జేసీబీలతో సహా మొత్తం 258 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గనుల శాఖ ఇప్పటి వరకు రూ.13,19,486 అపరాధ రుసుం వసూలు చేసిందన్నారు. ఇసుక అక్రమ తవ్వకం, రవాణా, అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం ఇవ్వాల్సిన వారు వాట్సాప్‌ నంబరు 93907 77727, 94407 96314, డయల్‌ 100, ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబరు-14500కు అందించాలని ఎస్పీ కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.