close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

రూ.19 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు

రెండు రోజుల్లో దాళ్వా పంటపై నిర్ణయం
‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టరు’లో మాధవీలత

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగరంలోని తమ విడిది కార్యాలయం నుంచి జేసీ కె.మాధవీలత శనివారం ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టరు’ కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి 18 మంది, ఇతర అంశాలపై మరో 11 మంది ఫోను చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 1200 మంది రైతుల నుంచి రూ.19 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గుడివాడ రెవెన్యూ డివిజను పరిధిలోని ముదినేపల్లి నుంచి ఓ రైతు మాట్లాడుతూ.. దాళ్వా పంట సాగు అనుమతి విషయమై వివరాలు తెలియజేయాలని కోరారు. జేసీ స్పందిస్తూ.. దాళ్వా విషయమై రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు.

ధాన్యం కొనుగోలు చేయడం లేదు..
కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన రైతు మురళీ, తిరువూరు మండలం రోలుపడి గ్రామానికి చెందిన రైతు బసవేశ్వరరావులు మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న 1194, 1061 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. జేసీ స్పందిస్తూ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొవ్వ మండలం పెనుమర్రు గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు మాట్లాడుతూ.. తేమ శాతం ఎక్కువగా ఉందని 2231 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిపారు. కంకిపాడు మండలానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ.. రైతుల ఖాతాలకు వెంటనే సొమ్ము జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. చాట్రాయి మండలం చిన్నంపేటకు సమీపంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఉందని, అక్కడకు ధాన్యం తీసుకెళ్లాలని రైతు వేణుగోపాలరావుకు జేసీ సూచించారు. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడికి చెందిన పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తమ భూమి సర్వే నంబర్లు ఈక్రాప్‌లో గానీ, వెబ్‌ ల్యాండులో గానీ కన్పించడం లేదని తెలిపారు. ఈ విషయమై జేసీ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.