close

ప్ర‌త్యేక క‌థ‌నం

అంతరిక్షంలో అల్లుకుపోదాం

ఇస్రో 31 మిషన్లు
ఈ నెలలో పీఎస్‌ఎల్‌వీ-సీ44, ఫిబ్రవరిలో చంద్రయాన్‌-2 ప్రయోగాలు!

అంతరిక్షంలో అల్లుకుపోదాం

‘‘ఇస్రో 2019లో ఆరు భూ పరిశీలన ఉపగ్రహాలు, ఆరు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు, రెండు స్పేస్‌ సైన్సు పెలోడ్‌లను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది’’.
‘‘ఇస్రో 2008 అక్టోబరులో చంద్రునిపైకి చంద్రయాన్‌-1ను విజయవంతంగా పంపింది. దీని ద్వారా చంద్రునిపై నీటి జాడలు ఉన్నట్లు తొలిసారిగా గుర్తించారు’’.

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2019లో తీరిక లేని షెడ్యూల్‌ను రూపొందించుకుంది. 31 మిషన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి 22 మిషన్లు(11 ప్రయోగాలు) చేపట్టనున్నారు. ఈ నెలలో పీఎస్‌ఎల్‌వీ-సీ44 ప్రయోగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనుసంధాన కార్యక్రమాలు గత నెల 24న షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ప్రారంభమయ్యాయి. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టనున్నారు. దీని అనుసంధానం పనులు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని వ్యాబ్‌లో చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే అధిక వేగవంతమైన అంతర్జాల సేవల కోసం జీశాట్‌-20 ఉప్రగహాన్ని కూడ కక్ష్యలోకి పంపనున్నారు.

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు
చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలు లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం విజయవంతమయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో  అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌  డాలర్ల విలువ చేయనుంది. ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది.  ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ పరుగులో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది.

రూ.600 కోట్ల వ్యయంతో..
చంద్రునిపై ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్‌, రష్యా దేశాలు తమ ప్రయోగాలతో పోటీ పడుతున్నాయి. ఇస్రో చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. ఈ ప్రయోగానికి రూ.600 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.