close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం 

కడప జిల్లాలోని రాజంపేట జనరల్‌ లోక్‌సభ స్థానం. ఇది 1952లో ఏర్పడింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 

కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ప్రత్యేకత కలిగి ఉంది. ఇంతకుముందు కడప జిల్లాలో నాలుగు సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలో మూడు సెగ్మెంట్లు ఉండేవి. ఇక్కడి లక్కిరెడ్డిపల్లె రద్దవడంతో చిత్తూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు చేరాయి. 1952లోనే నియోజకవర్గం ఏర్పాటైనప్పటికీ 1957 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 16సార్లు ఎన్నికలు జరగ్గా, 11సార్లు కాంగ్రెస్‌, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థి, వైకాపా ఒక్కోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి పురందేశ్వరిపై వైకాపాకు చెందిన మిథున్‌రెడ్డి 1,50,264 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1957 టి.ఎన్.విశ్వనాథరెడ్డి (కాంగ్రెస్‌)
సి.ఎల్.నరసింహా రెడ్డి (స్వతంత్ర)
* 1967 పి.పార్థసారథి(కాంగ్రెస్‌)
* 1971 పి.పార్థసారథి(కాంగ్రెస్‌)
* 1977 పి.పార్థసారథి(కాంగ్రెస్‌)
* 1980 పి.పార్థసారథి(కాంగ్రెస్‌)
* 1984 ఎస్.పాల కొండ్రాయుడు(తెదేపా)
* 1991 ఎ.సాయిప్రతాప్(కాంగ్రెస్‌) 
* 1996 ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్‌) 
* 1998 ఎ.సాయిప్రతాప్ (కాంగ్రెస్‌) 
* 1999 గునిపాటి రామయ్య(తెదేపా)
* 2004 ఎ.సాయిప్రతాప్(కాంగ్రెస్‌)
* 2009 ఎ.సాయిప్రతాప్(కాంగ్రెస్‌)
2014 పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(వైకాపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net