close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

ఆదిలాబాద్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ స్థానంగా ఉన్న ఆదిలాబాద్.. 2008 నియోజకవర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఎస్టీలకు రిజర్వు అయ్యింది.ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, సిర్పూర్(టి), నిర్మల్, ముథోల్, బోథ్(ఎస్టీ), ఆసిఫాబాద్(ఎస్టీ), ఖానాపూర్(ఎస్టీ) దీని పరిధిలోకి వస్తాయి.

నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 16 సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు తెదేపా, రెండు సార్లు తెరాస విజయం సాధించాయి. 
2014 ఎన్నికల్లో లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి నరేష్‌ జాదవ్‌పై తెరాస అభ్యర్థి గొడెం నగేష్‌ 1,71,092 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

తాజా ఎన్నికల్లో తెరాస నుంచి సిట్టింగ్‌ ఎంపీ జి.నగేష్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌  పార్టీ.. మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ టికెట్‌ కేటాయించింది. ఇక నియోజకవర్గంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని భాజపా
అధినాయకత్వం నలుగురైదుగురి పేర్లు పరిశీలించినా చివరకు సోయం బాపురావుకు టికెట్‌ ఇచ్చింది. 

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952-57- సి.మాధవరెడ్డి- సోషలిష్టు పార్టీ
* 1957-62- కె.ఆశన్న(కాంగ్రెస్‌)
* 1962-67- జి.నారాయణరెడ్డి(కాంగ్రెస్‌)
* 1967-71- పొద్దుటూరి గంగారెడ్డి(కాంగ్రెస్‌)
* 1971-77- పొద్దుటూరి గంగారెడ్డి(కాంగ్రెస్‌)
* 1977-80- గడ్డం నర్సింహారెడ్డి(కాంగ్రెస్‌)
* 1980-84- గడ్డం నర్సింహారెడ్డి(కాంగ్రెస్‌)
* 1984-89- సి.మాధవరెడ్డి(తెదేపా)
* 1989-91- పి.నర్సారెడ్డి(తెదేపా)
* 1991-96- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(తెదేపా)
* 1996-98- సముద్రాల వేణుగోపాలాచారి(తెదేపా)
* 1998-99- సముద్రాల వేణుగోపాలాచారి(తెదేపా)
* 1999-04- సముద్రాల వేణుగోపాలాచారి(తెదేపా)
* 2004-2008- తక్కల మధుసూధనరెడ్డి(తెరాస)
* 2008-2009- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(కాంగ్రెస్‌)(ఉప ఎన్నిక)
* 2009-2014- రమేష్ రాథోడ్(తెదేపా)
* 2014-2019- జి.నగేష్(తెరాస)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net