close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 
రిజర్వేషన్: జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు : నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా పరిధిలోనే ఉంటుంది. నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్

2014 ఎన్నికల్లో తెరాసకు చెందిన రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సుఖేందర్‌రెడ్డి 1,94,056 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఓటర్లు
పురుషులు: 7,81,444
మహిళలు: 7,97,682
ఇతరులు: 81
మొత్తం: 15,79,207

ఈసారి నల్గొండ పార్లమెంటు స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నిక రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికార పార్టీ అభ్యర్థి, స్థిరాస్తి వ్యాపారి వేమిరెడ్డి నర్సింహారెడ్డిల మధ్య జరుగుతున్న పోరు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను కలిగిస్తోంది. భాజపా నుంచి ఆరెస్సెస్‌ కార్యకర్త, స్వచ్ఛభారత్‌ మిషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ గార్లపాటి జితేందర్‌ పోటీ చేస్తుండగా.. సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కోడలు మల్లు లక్ష్మి ఆ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు.

తాజాగా ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు వీరే!

 

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు.. 
* 1952(ద్వి): ఆర్.నారాయణరెడ్డి పీడీఎఫ్ వి.బి.రావు(కాంగ్రెస్) 
* 1957(ద్వి)డి.వెంకటేశ్వరరావు పీడీఎఫ్ జి.ఎన్.రెడ్డి(కాంగ్రెస్) 
* 1960(ఉ.ఎ) ఎం.పెద్దయ్య(కాంగ్రెస్) 
* 1962 రావి నారాయణరెడ్డి(సీపీఐ) 
* 1967 ఎం.వై.సలీం (కాంగ్రెస్) 
* 1971 కె.రామకృష్ణారెడ్డి (టీపీఎస్) 
* 1977 ఎండీ.అబ్దుల్‌లతీఫ్ (కాంగ్రెస్) 
* 1980 టి.దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్-ఐ) 
* 1984 ఎం.రఘుమారెడ్డి (టీడీపీ) 
* 1989 చకిలం శ్రీనివాసరావు (కాంగ్రెస్) 
* 1991 బొమ్మగాని ధర్మబిక్షం (సీపీఐ) 
* 1996 బి.ధర్మబిక్షం (సీపీఐ) 
* 1998 సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ) 
* 1999 గుత్తాసుఖేందర్‌రెడ్డి (తెదేపా) 
* 2004 సురవరంసుధాకర్‌రెడ్డి (సీపీఐ) 
* 2009 జి.సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్)
* 2014 సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net