బాబోయ్‌.. బయో మెడికల్‌ వ్యర్థాలు
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:09 IST

బాబోయ్‌.. బయో మెడికల్‌ వ్యర్థాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ చుట్టు ముట్టడానికి ముందే భారత్‌లో ఆస్పత్రి వ్యర్థాల నిర్మూలన మహా అధ్వానంగా ఉండేది. కరోనా విరుచుకుపడ్డాక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రోజు రోజుకూ వ్యర్థాల నిల్వలు పెరిగిపోతున్నాయి.  కరోనా సెకండ్‌ వేవ్‌లో బయోమెడికల్‌ వ్యర్థాలు 46 శాతం పెరిగాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌ ఫిగర్స్‌ 2021’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌-19 సంబంధిత బయోమెడికల్‌ వ్యర్థాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. 2021 ఏప్రిల్‌లో కొవిడ్‌-19 బయో మెడికల్‌ వ్యర్థాలను భారత్‌ రోజుకు 139 టన్నుల మేర ఉత్పత్తి చేయగా.. మే 2021లో ఈ సంఖ్య రోజుకు 203 టన్నులకు పెరిగిందనీ, రెండు నెలల్లో గణనీయంగా 46 శాతం వ్యర్థాలు పెరిగాయని వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం దేశంలో బయో మెడికల్‌ వ్యర్థాల ఉత్పత్తి 2017-19 మధ్యకాలంలో రోజుకు 559 టన్నుల నుంచి 619 టన్నులకు పెరిగింది. అలాగే శుద్ది చేస్తున్న బయోమెడికల్‌ వ్యర్థాల శాతం 92.8 నుంచి 88 శాతానికి పడిపోయింది. ప్రమాదకర వ్యర్థాల ఉత్పత్తి యూనిట్ల సంఖ్య 3.5 శాతం పెరిగింది. ప్రమాదకర వ్యర్థాల ఉత్పత్తి దాదాపు 7 శాతం తగ్గింది. దేశంలో అధీకృత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సంఖ్య 84,805 నుంచి 1,53,885కు చేరుకుందని ఈ నివేదిక తెలిపింది. కాగా బయోమెడికల్‌ వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్న జాబితాలో 69 శాతంతో బిహార్‌ అగ్రస్థానంలో ఉండగా.. 47 శాతం వ్యర్థాలతో కర్ణాటక తర్వాతి స్థానంలో నిలిచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని