నీటిపై తేలియాడే యాపిల్ స్టోర్‌.. ఎక్కడంటే?
close

తాజా వార్తలు

Updated : 27/08/2020 12:58 IST

నీటిపై తేలియాడే యాపిల్ స్టోర్‌.. ఎక్కడంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. తొలి ఐఫోన్‌ నుంచి ఇప్పటి లేటెస్ట్ ఐఫోన్‌ మోడల్సే అందుకు ఉదాహరణ. తాజాగా ఈ సంస్థ సింగపూర్‌లో ఓ కొత్త స్టోర్‌ను నిర్మించనుంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? చూడ్డానికి గ్లోబ్ ఆకారంలో ఉండే ఈ కట్టడాన్ని పూర్తిగా నీటిలో తేలియాడే విధంగా నిర్మించనున్నారు. సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్‌ రిసార్ట్ వద్ద ఈ స్టోర్‌ను ప్రారంభించనున్నారు.

ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నీటిపై తేలియాడే యాపిల్ రిటైల్ స్టోర్. గతంలో ఈ స్టోర్ నిర్మిస్తున్న ప్రదేశంలో లగ్జరీ హోటల్, నైట్ క్లబ్ ఉండేవట. పూర్తిగా క్రిస్టల్‌తో నిర్మించినున్న ఈ స్టోర్‌ పగటిపూట సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలోని అంతరిక్ష నౌక లాగా.. రాత్రి పూట పర్యాటకులను ఆకట్టుకునే అందమైన భవంతిలా ఉండబోతోందట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని