AP News: అలా చేయకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లే: జగన్‌

తాజా వార్తలు

Updated : 08/06/2021 12:30 IST

AP News: అలా చేయకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లే: జగన్‌

అమరావతి: ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో ఏడాది నిధులను ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు రూ.370 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. గత్యంతరం లేక వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకుని వారు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లేనని జగన్‌ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని 3.7లక్షల మంది లబ్ధిదారులకు స్త్రీ నిధి, ఆప్కాబ్‌, ఇతర బ్యాంకుల నుంచి రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. అర్హత ఉండి రుణం రాకపోతే ఆందోళన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఏదైనా సహాయం, ఫిర్యాదుల కోసం 1902 నంబరుకు కాల్‌ చేయొచ్చని సీఎం జగన్‌ సూచించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని