బోట్‌హౌస్‌ను..అంబులెన్స్‌గా మార్చి..! 

తాజా వార్తలు

Published : 20/12/2020 01:51 IST

బోట్‌హౌస్‌ను..అంబులెన్స్‌గా మార్చి..! 

 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా వైరస్‌ కొంతమందికి కష్టాలను తీసుకువస్తే మరి కొంతమందిలో వినూత్న ఆలోచనలు రేకెత్తడానికి దోహదం చేసింది. కశ్మీర్‌లో బోట్‌ అంబులెన్స్‌ అందుబాటులోకి తేవాలన్న వినూత్న ఆలోచనా అలా వచ్చిందే. కరోనా వేళా.. తనలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని భావించిన ఓ హౌస్‌బోట్‌ యజమాని ఈ  ఆలోచన చేశారు. దీనివల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో ధాల్‌ లేక్‌ ప్రాంతంలో ఉన్నవారికి ఈ అంబులెన్స్‌ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. మరి సంగతులేంటో మీరు తెలుసుకోండి.

ధాల్ సరస్సుకు చెందిన ఓ హౌస్‌బోట్‌ యజమాని తారీక్‌ అహ్మద్‌ గతంలో కరోనా బారినపడ్డారు. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుప్రతికి వెళ్లే విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందే .. అక్కడ ఉన్న ప్రజలను ఎంతోకాలంగా వేధిస్తోందని గుర్తించారు. ఇకపై ఇంకెవరికీ ఆ పరిస్థితి రాకూడదని భావించారు. అంతే.. తనకు ఉన్న హౌస్‌బోట్‌ను అంబులెన్స్‌గా మార్చేశారు.

ధాల్‌ సరస్సు ప్రాంతంలో ఉండే ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పిన అహ్మద్‌... అత్యవసర సమయంలో వైద్య సేవలు అందక ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండేందుకే బోటు అంబులెన్స్‌కు శ్రీకారం చుట్టానని వివరించారు. అత్యవసర సమయంలో కావల్సిన వసతులను కలిగిన ఈ బోట్‌ అంబులెన్స్‌ 35 అడుగుల పొడవు ఉంటుంది. ఆక్సిజన్‌ సిలిండర్‌, ఈసీజీ వంటివి ఇందులో ఉంటాయని, దీని సేవలకోసం తనను సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అంబులెన్స్‌పై రాయిస్తానని చెప్పుకొచ్చారు అహ్మద్‌.


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని