రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో మళ్లీ పిటిషన్‌

తాజా వార్తలు

Published : 21/08/2020 12:43 IST

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో మళ్లీ పిటిషన్‌

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అంగీకరించింది. కేసు రీ- ఓపెన్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వ దాఖలు చేసిన దరఖాస్తును చెన్నై ఎన్జీటీ ధర్మాసనం అనుమతించింది. 

ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్‌ చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేయడంతో తీర్పు వాయిదా పడింది. ఈనెల 28న తుది వాదనలు వింటామని జస్టిస్‌ రామకృష్ణన్‌ ధర్మాసనం తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపేందుకు తమకు సమయం సరిపోలేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని గతంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని