నిమ్స్‌ నుంచి ఇద్దరు వాలంటీర్లు డిశ్చార్జ్‌
close

తాజా వార్తలు

Published : 21/07/2020 16:02 IST

నిమ్స్‌ నుంచి ఇద్దరు వాలంటీర్లు డిశ్చార్జ్‌

హైదరాబాద్‌: స్వదేశీ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు ఈ వాక్సిన్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. 14 రోజులపాటు వాలంటీర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.

 ఆ తర్వాత మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్‌) వైరస్‌ వల్ల శరీరంలో యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే రెండో డోసు టీకా అందిస్తారు. మొత్తం 60 మందిపై టీకా పరీక్షలు చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని