సాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారా నీటి విడుదల

తాజా వార్తలు

Updated : 21/08/2020 12:39 IST

సాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్‌ అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు. నాలుగు గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు నీరు విడుదల చేస్తున్నారు.  

సాగర్‌కు 3.45లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. దీంతో 29,712 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 583.20 అడుగులకు చేరింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను 289.3600 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని