Top Ten News @ 1 PM
close

తాజా వార్తలు

Published : 14/05/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. పుల్లూరు వద్ద నిలిచిపోయిన 20 అంబులెన్స్‌లు..

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు మళ్లీ నిలిపేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి తర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల నుంచి బెడ్‌ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ-పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* సీఎంలూ..సరిహద్దులో ఆర్తనాదాలు వినండి

2. అంబులెన్స్‌లు ఆపినా పట్టించుకోరా?: అచ్చెన్న

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకూ కులం ఆపాదిస్తారా? అని వైకాపా నేతలను ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆక్సిజన్‌ కొరతతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టదా?సరిహద్దు వద్ద అంబులెన్స్‌లను ఆపుతున్నా పట్టించుకోరా?తెలంగాణకు అంబులెన్స్‌లను పంపలేని స్థితిలో పాలకులున్నారు’’ అని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Corona : వైరస్‌ను జయించిన 2 కోట్ల మంది..

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మందికి కరోనా సోకింది. ఇక మరణాల సంఖ్య నాలుగువేలుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,00,79,599గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఇంట్లోనే రంజాన్‌ ప్రార్థనలు

రంజాన్‌ పర్వదినాన్ని నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు.   పలు ప్రాంతాల్లో  మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

5. Corona: మిశ్రమ డోసులు సురక్షితమే కానీ..

కొవిడ్‌-19 నివారణ కోసం భిన్న కంపెనీలు భిన్న రకాల వ్యాక్సిన్లను రూపొందిస్తున్నాయి. మొదటి డోసు కింద పొందిన కంపెనీ టీకానే రెండో డోసులోనూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని కలగలిపి, రెండు వేర్వేరు సంస్థల టీకాలను పొందడమూ సురక్షితమేనని బ్రిటన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది. కాకుంటే దీనివల్ల స్వల్పస్థాయిలో తలెత్తాల్సిన దుష్ప్రభావాలు.. ఒకమోస్తరు స్థాయికి పెరుగుతాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Fauci:డోసుల మధ్య వ్యవధి పెంపు సహేతుకమే

భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ మరోసారి పలు విలువైన సూచనలు చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మహమ్మారి నియంత్రణలో అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించడాన్ని సమర్థించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆ ధీర యువతి గుండె ఆగిపోయింది..!

ముక్కుకు ఆక్సిజన్‌ పైపు.. చేతికి సెలైన్‌ ఉన్నా.. ఆసుపత్రి బెడ్‌ మీద పాటలు వింటూ ఆనందంగా కన్పించిన యువతి గుర్తుందా. గత వారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన ఆమె.. కరోనా ముందు ఓడిపోయింది. కొవిడ్‌పై చేసిన పోరాటంలో ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. గోవా ఆస్పత్రిలో మృత్యుహేళ: మరో 13 మంది మృతి

గోవా వైద్య కళాశాల ఆస్పత్రి(జీఎంసీహెచ్‌)లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్‌ సరఫరా లేక శుక్రవారం మరో 13 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బాంబే హైకోర్టులోని గోవా బెంచ్‌కు వెల్లడించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో 70 మందికి పైగా మృతిచెందడం విచారకరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. No Mask: అమెరికాలో మరింత ఈజీ!

అమెరికాలో వ్యాక్సినేషన్‌ ఊపందుకొనే కొద్దీ నిబంధనలు మరింత సడలిస్తున్నారు. తాజాగా అమెరికాలో కార్యాలయాల వంటి ఇన్‌డోర్‌ ప్రదేశాల్లో, బాహ్య ప్రదేశాల్లో మాస్కులను తొలగించేందుకు అవకాశం కల్పించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేడు ఓవల్‌ ఆఫీస్‌లో  రిపబ్లికన్‌ సభ్యులతో కలిసి మాస్కును తొలగించారు.  కాకపోతే, రద్దీ ఉన్న బస్సులు, విమానాలు, ఆసుపత్రుల్లో మాత్రం మాస్కులు ధరించాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అక్ష‌య తృతీయ‌కు బంగారం కొనుగోలు చేయాల‌నుకుంటున్నారా?

అక్ష‌య తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు. ప్ర‌స్తుతం కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌లో ఉండ‌డంతో, ఆంక్ష‌ల మ‌ధ్య న‌గ‌ల దుకాణాల‌కు వెళ్ళి,  భౌతిక దూరం పాటిస్తూ బంగారం కొనుగోలు చేయ‌డం అంత సుల‌భం కాదు. అందువ‌ల్ల ఈ పండుగ వేళ బంగారాన్ని కొనుగోలు చేయాల‌నుకునే వారికి, గోల్డ్ పండ్స్‌, గోల్డ్ ఈటీఎఫ్‌, ఇ-గోల్డ్ వంటి ఇత‌ర ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని