ఏపీలో కోరలు చాస్తున్న కరోనా
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 16:47 IST

ఏపీలో కోరలు చాస్తున్న కరోనా

24 గంటల వ్యవధిలో 2,558 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా వివరాల ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది.

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఆరుగురు మృతిచెందారు.  కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,268కి చేరింది. ఒక్కరోజులో 915 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 14,913 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు 8,93,651 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని