ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డికి కరోనా

తాజా వార్తలు

Updated : 23/04/2021 14:21 IST

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డికి కరోనా

హైదరాబాద్‌: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స పొందుతున్నారు. గత రెండు మూడురోజుల్లో వ్యక్తిగతంగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్‌రెడ్డి సూచించారు. మంత్రికి కరోనా సోకడంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఈరోజు మైక్రోసాఫ్ట్‌ సంస్థతో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని