పన్ను ఊడితే వెంటనే ఏం చేయాలి?
close

తాజా వార్తలు

Published : 20/06/2021 01:31 IST

పన్ను ఊడితే వెంటనే ఏం చేయాలి?

ప్రమాదవశాత్తు కింద పడినప్పుడు లేదా ముఖానికి బలమైన దెబ్బలు తగిలినప్పుడు ఒకటో రెండో దంతాలు ఊడిపోవడమో, విరిగిపోవడమో జరుగుతుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది ఊడిన లేదా విరిగిన దంతాల ముక్కల గురించి పెద్దగా పట్టించుకోరు. హడావుడిగా ఆసుపత్రికి వెళ్లిపోతుంటారు. నిజానికి ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విరిగిన లేదా ఊడిన దంతాలను వెంట తీసుకెళితే, చాలావరకు వాటిని పునర్నిర్మించవచ్చని చెబుతారు దంత వైద్యులు. పన్ను విరిగినప్పుడు, ఊడి కింద పడిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!

ఈ జాగ్రత్తలు అవసరం - డా. వికాస్‌గౌడ్‌, డెంటల్‌ సర్జన్‌
ప్రమాదంలో పన్ను ఊడినట్లైతే.. వెంటనే దంతవైద్యుడిని సంప్రదించడం కష్టమవుతుంది. అందుకోసమని ఆ పంటిని కడిగేసి ఐస్‌ కానీ, మెడికల్‌ షాపులో దొరికే సెలైన్‌లో కానీ లేదా పేషంట్‌ నాలుక కిందకానీ, బుగ్గ దగ్గరకానీ పెట్టుకోవాలి. ఆ తర్వాత దంత వైద్యుడి దగ్గరకు తీసుకువచ్చినట్లైతే.. ఆ పంటిని అదే ఆకృతిలో బిగించి, మాములు స్థితికి తీసుకురావడానికి వీలవుతుంది.

వదులుగా అయితే..
ప్రమాదంలో పన్ను వదులయితే.. ఆ లూస్ పళ్లకి స్ల్పింటింగ్‌ చేయవచ్చు. అంటే పక్కకున్న గట్టిదంతాల సపోర్ట్‌ తీసుకొని వెనుక నుంచి కాంపోజిట్‌ రెసిన్‌ లేదా వాయాస్‌ వాడుతూ గట్టి పరుస్తారు. రెండోది ఒకసారి శరీరం దాన్ని అంగీకరించాక, దంతాలను గట్టి పరిచాక.. బోన్‌ ఫార్మేషన్‌ అవుతుంది. పంటికి రూట్‌ కెనాల్‌ చికిత్స చేసి క్యాప్‌ వేసినట్లయితే మళ్లీ మనం శాశ్వతంగా ఉండేటట్టు చూసుకోవచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని