రైతుల బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

తాజా వార్తలు

Updated : 08/01/2020 22:21 IST

రైతుల బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి: ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అమరావతి పరిరక్షణ ఐకాస జిల్లాలకు తలపెట్టిన బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు వెళ్తున్న బస్సులను సీజ్‌ చేసి మందడం డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు బస్సు యాత్ర కోసం విజయవాడ వెళ్తున్న తుళ్లూరు మహిళలను పోలీసులు అడ్డుకుని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మహిళలు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బస్సు యాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా మందడం డీఎస్పీ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున రైతులు ముట్టడించారు. రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని