కండక్టర్‌పై దాడిచేసిన కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

తాజా వార్తలు

Published : 06/03/2020 13:37 IST

కండక్టర్‌పై దాడిచేసిన కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

హైదరాబాద్‌: ఓ మహిళా కండక్టర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు ఎస్కార్ట్‌ ఏఆర్‌ కానిస్టేబుళ్లు సత్యనారాయణరెడ్డి, రామకృష్ణా గౌడ్‌ను సీపీ అంజనీ కుమార్‌ సస్పెండ్‌ చేశారు. అంబర్‌పేట ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్‌ చర్లపల్లి జైలు నుంచి ఒక ఖైదీని గురువారం జడ్చర్ల న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరుగు ప్రయాణంలో వారు కొల్లాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. వారిని మహిళా కండక్టర్‌ శ్రీలత టికెట్టు అడగ్గా వారెంటు ఉందని చెప్పారు. కానీ చూపించేందుకు నిరాకరించడంతో కండక్టర్‌కు, కానిస్టేబుల్‌ రామకృష్ణాగౌడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ ఆమెపై చేయి చేసుకోగా శ్రీలత ముఖంపై గాయం అయ్యింది. ఈ ఘటనపై బాధితురాలు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేసింది. సీఐ వీరస్వామి కండక్టరును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ సీపీ అంజనీ కుమార్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని