‘ఆయుష్‌’ ఉత్పత్తులు పెంచండి: ప్రధాని మోదీ

తాజా వార్తలు

Updated : 28/03/2020 17:44 IST

‘ఆయుష్‌’ ఉత్పత్తులు పెంచండి: ప్రధాని మోదీ

దిల్లీ: దేశమంతా ‘కొవిడ్‌-19’ను ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ‘ఆయుష్‌’ ఔషధ ఉత్పత్తిదారులు తమ సరఫరాను పెంచాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం ప్రధాని కార్యాలయంలో ఆయుర్వేద వైద్యులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు వైరస్‌ బారినపడకుండా అవసరమైన శానిటైజర్లు, ఇతర రక్షణ ఔషధాలను తమ పరిధిలో ఉన్న వనరులను వాడుకోని అధిక మొత్తంలో తయారుచేయాలని వారికి సూచించారు. ఇప్పటికే ఆయుష్‌ మంత్రిత్వశాఖ ‘ఇంటివద్దనే యోగా’ కార్యక్రమం పేరిట ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుందన్నారు. అలాగే ఈ వైరస్‌ను అంతం చేసే శక్తి కూడా భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆయుష్‌ శాస్త్రవేత్తలు, ఐసీఎమ్‌ఆర్‌, సీఎస్‌ఐర్ వంటి పరిశోధనా సంస్థలు కలిసి పనిచేసి దీనికి నివారణ మార్గం కనుగొనాల్సిందిగా కోరారు. ఆయుష్‌ ద్వారా అవసరమైతే ప్రైవేటు ఆయుర్వేద వైద్యులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. ఆయుర్వేద వైద్యం, భారతీయ సంప్రదాయ వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైతే టెలి మెడిసిన్‌ మార్గాన్ని కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఆయుష్‌ విభాగంలోనే యునానీ, సిద్ది, హోమియోపతి వంటి వైద్యసేవలు ఉంటాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని