మాస్కులు కుట్టే పనిలో ఖైదీలు

తాజా వార్తలు

Published : 04/04/2020 19:45 IST

మాస్కులు కుట్టే పనిలో ఖైదీలు

దిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో ఒక్కసారిగా ముఖానికి వేసుకునే మాస్కుల డిమాండ్‌ పెరిగిపోయింది. ఇప్పటికే పలు కంపెనీలు ఎన్నడూ లేనంతగా మాస్కుల ఉత్పత్తిని పెంచి లాభాలను గడిస్తున్నాయి. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా విధులు నిర్వహస్తున్న పోలీసులకూ మాస్కుల అవసరం ఎంతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తీహాడ్‌, మండోలి జైళ్ల అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఖైదీలతో మాస్కులను తయారుచేయిస్తున్నారు. కుట్టుమిషన్ల సహాయంతో ఇప్పటివరకు 75 వేల మాస్కులను తయారుచేసినట్టు పోలీసు అధికారులు తెలుపుతున్నారు. వీటిని విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌కానిస్టేబుళ్లకు అందిస్తున్నారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి ఈ మాస్కులను వివిధ సంస్థలకు కూడా సరఫరా చేస్తునట్టు జైళ్లశాఖ డీజీ సందీప్‌గోయల్‌ తెలిపారు. గతవారంలో దిల్లీ ట్రాఫిక్‌పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు 3వేలు, దిల్లీ అర్బన్‌ షెల్టర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డుకు 500, దిల్లీ లీగల్‌సర్వీసు అథారిటికీ 2వేలు, సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌కు 2వేలు, మహిళా,శిశు సాధికారత విభాగానికి 1000 మాస్కులను సరఫరా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మార్చి నెలలో ప్రారంభించిన ఈ మాస్కుల తయారీలో ప్రతిరోజూ 1500 నుంచి 2000 మాస్కుల తయారుచేస్తునట్టు ఆయన వివరించారు. ఇప్పటవరకు 750 లీటర్ల శానిటజైర్‌ ద్రావాణాన్ని కూడా తయారు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 68 మంది మరణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని